మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 03, 2020 , 21:27:00

బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్యకేసు నిందితుడి అరెస్టు

బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్యకేసు నిందితుడి అరెస్టు

ప్రయాఘ్‌రాజ్‌ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 2005 జనవరి 25న జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్యకేసులో నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మాజీ ఎంపీ అథిక్‌ అహ్మాద్‌ సోదరుడు ఖలీల్‌ అజీమ్‌ అలియాస్‌ అశ్రఫ్‌గా తెలిపారు. 2004లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో రాజ్‌పాల్‌ అలహాబాద్‌ పశ్చిమం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయగా ప్రత్యర్థిగా అజీమ్‌ పోటీచేసి ఓటమి పాలయ్యాడు. రాజ్‌పాల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన 4నెలల తరువాత సులేమ్‌ సరాయ్‌ బజార్‌లో దుండగులు ఆయనతోపాటు ఇద్దరు గన్‌మెన్లపై దాడి చేసి హతమార్చారు. పోలీసు విచారణలో హత్యలో అశ్రఫ్‌ ప్రధాన పాత్రదారుడిగా తేలడంతో నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతడిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. శుక్రవారం ఉదయం ఓ పనిపై బయటకు వచ్చిన అశ్రఫ్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. logo