శుక్రవారం 27 నవంబర్ 2020
Crime - Oct 27, 2020 , 21:00:20

లారీని ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు దుర్మరణం

లారీని ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు దుర్మరణం

ఆగ్రా :  దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో తల్లీకూతురు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలోని నివాసం ఉండే రమేశ్‌ కుటుంబం కారులో ఆగ్రాకు బయల్దేరాడు. యమునా ఎక్స్‌ప్రెస్‌పై 126 మైలురాయి వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే భార్య ఆరాధన (45), కూతురు శివాణి (15) మృతి చెందారు. రమేశ్‌పాటు అతడి బంధువు అంజలికి తీవ్రగాయాలయ్యాయి. అటుగా వాహనంలో వెళ్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ఘటనను గుర్తించి వివరాలు తెలుసుకుంటుండగా మరో ట్రక్కు ఢీకొని అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఎటా జిల్లాకు చెందిన నీమ్‌సింగ్‌ రాజ్‌పుత్‌గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.