శుక్రవారం 05 మార్చి 2021
Crime - Jan 22, 2021 , 12:41:48

ప‌ది పెళ్లిళ్లు.. సంతానం క‌ల‌గ‌లేదు.. చివ‌ర‌కు ఇలా..

ప‌ది పెళ్లిళ్లు.. సంతానం క‌ల‌గ‌లేదు.. చివ‌ర‌కు ఇలా..

ల‌క్నో : ఓ రైతు ప‌ది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. కానీ సంతానం క‌ల‌గ‌లేదు. కోట్ల రూపాయాల ఆస్తి ఉంది.. కానీ అనుభ‌వించే వారు లేరు. అటు భార్య‌లు లేరు.. ఇటు పిల్ల‌లు లేరు.. దీంతో ఆ రైతు ఆస్తిపై క‌న్నేసిన కొంద‌రు దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలి జిల్లాలో వెలుగు చూసింది. 

బ‌రేలి జిల్లాకు చెందిన జ‌గ‌న్ లాల్ యాద‌వ్‌(52) 1990 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొద‌టి ఐదుగురు భార్య‌లు అనారోగ్యంతో చ‌నిపోయారు. ముగ్గురు భార్య‌లు యాద‌వ్‌ను వ‌దిలేసి వెళ్లిపోయారు. ఇక మిగిలిన ఇద్ద‌రు భార్య‌లు యాద‌వ్‌తోనే ఉంటున్నారు. అయితే ఈ ప‌ది మంది భార్య‌ల‌కు సంతానం క‌ల‌గ‌లేదు. ఈ క్ర‌మంలో మొద‌టి భార్య‌, మొద‌టి భ‌ర్త కుమారుడు యాద‌వ్‌తోనే ఉన్నాడు. యాద‌వ్ పేర ఉన్న ఆస్తిని త‌నకు రాసివ్వాల‌ని ఆ పిల్లోడు ఒత్తిడి తెస్తున్నాడు.

ఆస్తి కోస‌మే హ‌త్య‌

అయితే జ‌గ‌న్ లాల్ యాద‌వ్ నిత్య పెళ్లి కొడుకుగా మార‌డంతో ఆయ‌న తండ్రి త‌న ఆస్తిని మొత్తాన్ని పెద్ద కుమారుడి పేరిట రాసిచ్చాడు. దీంతో జ‌గ‌న్ కోర్టుకు వెళ్లి.. ఆస్తిలో కొంత భాగాన్ని త‌న పేరు మీద ద‌క్కించుకున్నాడు. ఈ ఆస్తి విలువ కోట్ల రూపాయాల్లో ఉంటుంది. ఈ ఆస్తి కోసం మొద‌టి భార్య కుమారుడికి, యాద‌వ్ మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి బుధ‌వారం రాత్రి రైతు జ‌గ‌న్‌ను అప‌హ‌రించి గొంతు నులిమి చంపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యాద‌వ్‌ను హ‌త్య చేసిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. 

VIDEOS

logo