మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 20:41:51

పోలీసులు పట్టుకునేందుకు వస్తే డ్యాన్స్‌ చేసిన నిందితుడు..

పోలీసులు పట్టుకునేందుకు వస్తే డ్యాన్స్‌ చేసిన నిందితుడు..

యూపీ: ఓ హత్య కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రాగా, అతడు భవనంపైకి ఎక్కి డ్యాన్స్‌ చేస్తూ, నాటు తుపాకీని సినిమా స్టైల్‌లో తిప్పాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో బుధవారం జరిగింది. మీరట్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌సాహ్ని తెలిపిన వివరాల ప్రకారం.. శివపాల్ అకా కలు అనే వ్యక్తి సర్ధన ప్రాంతంలోని సిండికేట్ బ్యాంక్ గార్డును కాల్చి చంపాడు. పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. 

పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు, అతడు సమీపంలోని భవనం పైకప్పుపైకి చేరుకున్నాడు. పోలీసులను చూసి డ్యాన్స్‌ చేస్తూ నాటు తుపాకీలను సినిమాటిక్‌గా గిరాగిరా తిప్పాడు. అనంతరం పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఫైరింగ్‌ స్టార్ట్‌ చేయగా, అతడికి బుల్లెట్‌ తగిలి గాయమైంది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివపాల్‌కు క్రిమినల్ చరిత్ర ఉంది.  ప్రస్తుతం, అతడిని దవాఖానలో చేర్పించామని, డాక్టర్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని సాహ్ని తెలిపాడు. అనంతరం విచారణను ప్రారంభిస్తామని పేర్కొన్నాడు. అతడి వద్దనుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించాడు.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo