సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 21, 2020 , 11:31:11

జర్నలిస్టు హత్యకేసులో ఐదుగురి అరెస్టు

జర్నలిస్టు హత్యకేసులో ఐదుగురి అరెస్టు

ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ విజయ్‌నగర్‌లో జర్నలిస్టును హతమార్చిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కలానిధి నైతాని తెలిపారు. విజయ్‌నగర్‌కు చెందిన విక్రమ్‌ జోషి అనే జర్నలిస్టు తన మేనకోడలిని కొందరు వేధిస్తున్నారని ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సోమవారం తన సోదరి స్థలం నుంచి జోషి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో దుండగులు అతడిపై కాల్పులు జరపడంతో తలకు బుల్లెట్ గాయమైంది.

పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం స్థానిక యశోద దవాఖానకు తరలించామని ఎస్పీ పేర్కొన్నారు. కొంతమంది మా మేనకోడలిని వేధించడంతో నా సోదరుడు పోలీసు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత అతన్ని ఆ దుండగులు కాల్చి చంపారు’ అని జోషి సోదరుడు అనికేత్‌ జోషి చెప్పారు.


logo