మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 01, 2020 , 10:37:05

యూపీ జ‌ర్న‌లిస్టుల‌ హ‌త్య కేసు : ముగ్గురు అరెస్ట్

యూపీ జ‌ర్న‌లిస్టుల‌ హ‌త్య కేసు : ముగ్గురు అరెస్ట్

ల‌క్నో : న‌వంబ‌ర్ 27వ తేదీన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రామ్‌పూర్ జిల్లాలో ఓ ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం విదిత‌మే. జ‌ర్న‌లిస్టు రాకేశ్ సింగ్ నిర్బిక్‌(37), పింటు సాహు(34) హ‌త్య కేసులో ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తీవ్ర గాయాల‌పాలైన రాకేశ్ సింగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా ఉన్న స‌ర్పంచి అవినీతిని బ‌య‌ట‌పెట్టినందుకే త‌న‌తో పాటు త‌న స్నేహితుడిని టార్గెట్ చేశార‌ని చికిత్స పొందుతున్న స‌మ‌యంలో రాకేశ్ సింగ్ పోలీసుల‌కు తెలిపాడు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జ‌ర్న‌లిస్టుల‌ను హ‌త్య చేసిన స‌ర్పంచ్ కుమారుడు  రింకు మిశ్రాతో పాటు అక్రం, ల‌లిత్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. జ‌ర్న‌లిస్టుల‌పై దుండ‌గులు శానిటైజ‌ర్ పోసి నిప్పంటించార‌ని పోలీసులు తెలిపారు.