గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 06, 2020 , 17:49:46

యువతి, ప్రియుడ్ని గదిలో బంధించి సజీవదహనం

యువతి, ప్రియుడ్ని గదిలో బంధించి సజీవదహనం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పరువుహత్య ఘటన వెలుగుచూసింది. తమ కుమార్తె ప్రియుడితో కలిసి గదిలో ఉండటం చూసిన ఆమె తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. ఆ గదికి తాళం వేసి నిప్పంటించారు. దీంతో వారిద్దరు సజీవ దహనమయ్యారు. బండా జిల్లాలోని మాతుంద్‌ ప్రాంతంలోని కర్చా గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. 23 ఏండ్ల భోలా, 19 ఏండ్ల ప్రియాంక ప్రేమించుకుంటున్నారు. బుధవారం సాయంత్రం వారిద్దరు కలిసి గదిలో ఉండటాన్ని యువతి తల్లిదండ్రులు చూశారు. దీంతో కోపంతో రగిలిపోయిన వారు ఆ పూరి గుడిసెకు తాళం వేసి నిప్పుపెట్టారు. దీంతో యువతి, ఆమె ప్రియుడు మంటల్లో కాలిపోయారు.

80 శాతంపైగా కాలిన గాయాలైన ఇద్దరిని స్థానికులు దవాఖానకు తీసుకెళ్లగా భోలా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రియాంకను కాన్పూర్‌ దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించింది. కాగా, వారిద్దరు అప్పటికే విషం తాగినట్లు ఆ యువతి తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. యువతి కుటుంబంలోని 9 మందిపై కేసులు నమోదు చేశామని, వారిలో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు చిత్రకూట్ ధామ్ రేంజ్ ఐజీ కె సత్యనారాయణ తెలిపారు.logo