గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 12, 2020 , 13:35:59

సినీఫక్కీలో ఆభరణాల దుకాణంలో చోరీ.. రూ. 35 లక్షల సొత్తుతో దుండుగులు పరారీ

సినీఫక్కీలో ఆభరణాల దుకాణంలో చోరీ.. రూ. 35 లక్షల సొత్తుతో దుండుగులు పరారీ

ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌ జిల్లాలో బంగారు దుకాణంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన ముగ్గురు దుండగులు దుకాణం నుంచి రూ.35 లక్షల విలువైన సొత్తును అపహరించారు. బన్నదేవి ప్రాంతంలోని ఓ ఆభరణాల దుకాణానికి ముగ్గురు బైక్‌పై వచ్చారు. లోపలికి రాగానే చేతులు శానిటైజ్‌ చేసుకుంటున్నట్లు నటించి పిస్టల్స్ తీసి దుకాణంలోని వారిని బెదిరించారు.  నిమిషం వ్యవధిలో ఆభరణాలు, నగదు దోచుకొని పరారయ్యారు.

చోరీ జరిగినప్పుడు ముగ్గురు కస్టమర్లు సైతం దుకాణంలో ఉన్నారు. ఈ తతంగమంతా దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దుండగులు 700 గ్రాముల బంగారంతోపాటు రూ .40 వేల నగదు అపహరించినట్లు షాపు యజమాని సుందర్ వర్మ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ అభిషేక్ కుమార్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo