మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jun 26, 2020 , 17:46:54

భ‌ర్త దారుణ హ‌త్య‌.. భార్య ప‌రిస్థితి విష‌మం

భ‌ర్త దారుణ హ‌త్య‌.. భార్య ప‌రిస్థితి విష‌మం

మంచిర్యాల : ఇద్ద‌రు దంప‌తుల‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేశారు. ఈ దాడిలో భ‌ర్త చ‌నిపోగా, భార్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ దారుణ ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లంలోని రెచిని గ్రామంలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. 

రైతు పోశం(50) త‌న భార్య ఇంట్లో ఉన్న స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వ‌చ్చారు. ఆ త‌ర్వాత ప‌దునైన ఆయుధాల‌తో వారిపై దాడి చేయ‌డంతో.. భ‌ర్త ప్రాణాలు కోల్పోయాడు. భార్యకు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. 

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇంటి వివాదం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల‌ను క‌నుగొనే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు. హ‌త్య జ‌రిగిన ప్రాంతంలో ఆధారాల కోసం పోలీసులు క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు.


logo