శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 15:18:16

కర్నూల్‌లో దారుణం.. భర్తను బంధించి భార్యపై గ్యాంగ్‌రేప్‌

కర్నూల్‌లో దారుణం.. భర్తను బంధించి భార్యపై గ్యాంగ్‌రేప్‌

కర్నూల్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లాలో దారుణం జరిగింది. వెలుగోడు పోలీసు స్టేషన్‌ పరిధిలోని జమ్మినగర్‌ తండాలో వృద్ధ దంపతులపై ఆకతాయిలు దాడి చేశారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెలుగోడు సమీపంలో తన భర్తతో కలిసి వెళ్తున్న ఓ వివాహితను నలుగురు దుండగులు ఆపారు. ఆ తర్వాత వృద్ధుడిని లాక్కెళ్లి చితకబాదారు. అనంతరం ఆమెపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలిని కూడా దారుణంగా కొట్టారు.

తమకు జరిగిన అన్యాయంపై వెలుగోడు పోలీసులను బాధితులు సంప్రదించారు. నలుగురు దుండగులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. పోలీసులపై బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వెలుగోడు పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


logo