బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 05, 2020 , 13:56:41

మ‌ద్యం తాగించి లైంగిక‌దాడి.. మ‌హిళ మృతి

మ‌ద్యం తాగించి లైంగిక‌దాడి.. మ‌హిళ మృతి

సంగారెడ్డి : జిల్లాలోని కొల్లూరు తండా శివారులో దారుణం జ‌రిగింది. భోజ్య తండాకు చెందిన పత్లోత్ ల‌త‌(30) అనే వివాహిత మంగ‌ళ‌వారం రాత్రి అదృశ్య‌మైంది. మియాపూర్‌లోని త‌న త‌ల్లిగారింటికి వెళ్తుండ‌గా ఆమెను ముగ్గురు వ్య‌క్తులు అప‌హ‌రించారు. ల‌త ఇంటికి రాక‌పోవ‌డంతో.. ఆమె సోద‌రుడు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ల‌త మృత‌దేహాన్ని గురువారం ఉద‌యం తండా శివారులోని రేకుల షెడ్డులో స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రామ‌చంద్రాపురం పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ల‌త మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

అయితే ల‌త‌ను మ‌ధు నాయ‌క్‌(భోజ్య తండా), నందు యాద‌వ్‌(కొల్లూరు), కుటుంబ రెడ్డి అనే ముగ్గురు క‌లిసి అప‌హ‌రించిన‌ట్లు స‌మాచారం. ల‌త‌కు మార్గ‌మ‌ధ్య‌లోనే మ‌ద్యం తాగించి.. రేకుల షెడ్డు వ‌ద్ద‌కు తీసుకెళ్లి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు లైంగిక‌దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆమె స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ల‌త‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.  


logo