ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 23, 2020 , 09:38:50

వరంగల్‌లో ఆటో డ్రైవర్‌ హత్య

వరంగల్‌లో ఆటో డ్రైవర్‌ హత్య

వరంగల్‌: వరంగల్‌లోని మండిబజార్‌లో ఓ ఆటో డ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆటో డ్రైవర్‌పై దాడిచేశారు. విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసున్నారు. మృతుడు దేశాయిపేటకు చెందిన రాజు కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు. హత్యకు పాత కక్ష్యలే కారణమని తెలిపారు.


logo