శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 05, 2020 , 17:41:00

ముర్మూర్ పంపు హౌస్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

ముర్మూర్  పంపు హౌస్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

పెద్దపల్లి : జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామ శివారులో గల పంపు హౌస్ లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. శవం పూర్తిగా కుళ్లియిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. సుమారు 40- 45 సంవత్సరాల వయసు,  సుమారు 4.5 ఫీట్ల ఎత్తు ఉంటుంది. మృతదేహ పైన ఎరుపు, నీలి రంగు గల చీర, నీలం, వంకాయ రంగు గలా ఫుల్ జాకెట్ ముదురు ఇటుక రంగు లంగా ఉన్నవి. తలపైన వెంట్రుకలు లేవు. గుర్తు తెలియని శవంగా కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. 


logo