శుక్రవారం 05 మార్చి 2021
Crime - Jan 27, 2021 , 16:01:25

కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

హైదరాబాద్‌ : నగర పరిధిలోని సూరారంలో గల కట్టమైసమ్మ చెరువులో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. దుండిగల్‌ పోలీసుల సమాచారం మేరకు మహిళ వయస్సు 40 ఏళ్లుగా తెలిపారు. క్లూస్‌ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందన్నారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

VIDEOS

logo