శనివారం 11 జూలై 2020
Crime - May 28, 2020 , 15:03:50

అంబర్‌పేటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

అంబర్‌పేటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేట్‌లో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయ్యింది. గోల్నాక సెయింట్‌ అంబర్‌ పాఠశాలలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆధారాల కోసం పాఠశాలతోపాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళ వయస్సు 35నుంచి 40 ఏండ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాఠశాల గేట్లకు తాళం వేసి ఉన్నప్పటికీ మృతదేహం లభించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo