గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 20:25:45

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌.. చోరీ బాట ఎంచుకున్న ఇద్ద‌రి అరెస్టు

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌.. చోరీ బాట ఎంచుకున్న ఇద్ద‌రి అరెస్టు

సంగారెడ్డి : క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా నిరుద్యోగులుగా మారిన ఇద్ద‌రు స్నేహితులు నేరాల బాట ప‌ట్టారు. గ‌త రెండు నెల‌ల్లో ప‌టాన్‌చెరు చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల ఏటీఎంల‌లో న‌గ‌దును దొంగిలించేందుకు విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేశారు. గ్యాస్ క‌ట్ట‌ర్లు, ఇత‌ర సామాగ్రితో ఏటీఎంల చోరీకి ఆరుసార్లు ప్ర‌య‌త్నించారు. కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన సంగారెడ్డి పోలీసులు నిందితులిద్ద‌రినీ అరెస్టు చేసి జైలుకు పంపించారు. మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ ఖాలీద్‌(30), ఆటో డ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవాడు. ఎరుకుల మ‌హేశ్‌(32) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఇరువురు సంగారెడ్డి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లానికి చెందిన‌వారు. 


logo