శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 13:54:11

త‌లోజా జైల్లో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ ఆత్మ‌హ‌త్య‌

త‌లోజా జైల్లో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ ఆత్మ‌హ‌త్య‌

ముంబై : మ‌హారాష్ర్ట రాయ్‌ఘ‌డ్ జిల్లాలోని త‌లోజా జైల్లో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ(36) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఖైదీ దినేష్ నార్క‌ర్‌.. ఓ హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అత‌న్ని ఈ నెల మొద‌ట్లో అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో జైలుకు త‌ర‌లించే ముందు జులై 10న దినేష్‌కు కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో అత‌నికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ క్ర‌మంలో త‌లోజా జైల్లోని ఆస్ప‌త్రి వార్డులో ఆయ‌న‌ను ఉంచారు. 

మొత్తానికి బుధ‌వారం ఉద‌యం అత‌ని బ్యార‌క్ లో ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించాడు. ఖైదీలను లెక్క‌పెడుతున్న స‌మ‌యంలో దినేష్‌ను గుర్తించామ‌ని జైలు అధికారులు తెలిపారు. కానీ దినేష్‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. హ‌త్యే అని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. దినేష్ మృతిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. 

త‌లోజా జైల్లో 33 ఏళ్ల ఓ అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ కూడా ఈ ఏడాది మే 27న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇప్పుడు దినేష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 


logo