సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 11:21:27

పబ్జీ ఎఫెక్ట్‌ : యువకుడు ఆత్మహత్య

పబ్జీ ఎఫెక్ట్‌ : యువకుడు ఆత్మహత్య

నదియా : పబ్జీ గేమ్‌కు బానిసైన యువకుడు ఆడేందుకు వీల్లేకపోవడంతో ఆవేదనలో ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్బా లాల్పూర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్మీ అధికారి బిస్వజిత్ హాల్డర్ కుమారుడు ప్రీతిమ్ హాల్డర్ (21) ఐటీఐ చదువుతున్నాడు. రోజు రాత్రి మొబైల్‌లో విపరీతంగా పబ్జీ ఆడేవాడు. ఇటీవల పబ్జీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆడేందుకు వీల్లేక నాటి నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. శుక్రవారం ఉదయం తన గదికి వెళ్లి బయటకు రాలేదు. తల్లి పదేపదే తలుపు తట్టినా తీయకపోవడంతో పొరుగువారి సాయంతో పగులగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పబ్జీ ఆడేందుకు కుదరకే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రీతమ్‌ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo