e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home క్రైమ్‌ పిల్లలు పుట్టడం లేదని.. బాలుడ్ని బలిగొన్న మహిళ

పిల్లలు పుట్టడం లేదని.. బాలుడ్ని బలిగొన్న మహిళ

పిల్లలు పుట్టడం లేదని.. బాలుడ్ని బలిగొన్న మహిళ

న్యూఢిల్లీ: పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఒక మహిళ అతడి సలహా మేరకు ఒక బాలుడ్ని బలి ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో పెండ్లి అయ్యింది. ఆమెకు సంతానం కలుగకపోవడంతో తోడికోడళ్లు, మెట్టింటి వారు హేళన చేయసాగారు. ఇది భరించలేక నాలుగేండ్ల కిందట పుట్టిల్లు అయిన ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయిలో క్షుద్రపూజలు చేసే ఒక వ్యక్తిని ఆశ్రయించింది. సంతానం కలుగాలంటే ఒక చిన్నారిని బలి ఇవ్వాలని అతడు సూచించాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆ మహిళ పొరుగున్న ఉన్న రెండున్నర ఏండ్ల బాలుడ్ని చంపాలని నిర్ణయించుకున్నది. శనివారం పక్క బిల్డింగ్‌ మేడపై ఒంటరిగా ఆడుకుంటున్నఆ చిన్నారి గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో అక్కడ ఉంచింది.

మరోవైపు తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిన్నారి గురించి పోలీసులు ఆరా తీసి గాలించగా బిల్డింగ్‌ మేడపై ఒక బ్యాగ్‌ కనిపించింది. దానిని తెరిచిచూడగా బాలుడి మృతదేహం అందులో ఉన్నది. దీనిపై దర్యాప్తు చేయగా ఆ చిన్నారిని తానే చంపినట్లు ఆ మహిళ ఒప్పుకున్నది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లలు పుట్టడం లేదని.. బాలుడ్ని బలిగొన్న మహిళ

ట్రెండింగ్‌

Advertisement