శనివారం 16 జనవరి 2021
Crime - Oct 06, 2020 , 11:21:14

కూతురి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

కూతురి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

పెద్దపల్లి : కన్న కూతురు మృతి చెందగా ఓ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనారోగ్యంతో మృతి చెందగా.. మలి వయస్సులో సాకేందుకు ఎవరూ లేక ఓ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు.. దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనుపురం మమత (28) కూలీ పనులు చేస్తూ తండ్రి అనుపురం నర్సయ్య (70) పోషిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. కూతురు దూరమైందనే బాధ, వయస్సు మీదపడగా ఎవరూ లేరన్న బాధతో సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. తండ్రీ, కూతురి మరణంతో కటికెనపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.