సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 14, 2020 , 08:45:07

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

విశాఖ : భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త  ప్రాణాలు విడిచిన ఘటన విశాఖ సింహాచలం కొండపైన గిరిజన గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింహగిరి గిరిజన గ్రామానికి చెందిన జలుమూరి శ్రావణ్‌కుమార్‌ (20) అదే ప్రాంతంలో ఉండే అంబిక అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. ప్రసవం కోసం ఈ నెల 6న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. అంబికకు ఫిట్స్‌వడంతో ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటికి తీశారు.

కానీ అస్తస్థతకు గురైన అంబిక మరణించింది. దీంతో తీవ్ర మనస్థానపానికి గురైన శ్రావణ్‌ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో చిన్నారి అనాథగా మారాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo