శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 11, 2020 , 12:36:11

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

హైదరాబాద్‌ : భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండపూర్‌లో ఓ వ్యక్తి స్థానికంగా ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల అనారోగ్యంతో అతని భార్య మృతి చెందింది. కొన్ని రోజుల పాటు ఒంటరిగా జీవనం సాగించిన వ్యక్తి తను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో  తేలిందని పోలీసులు తెలిపారు. 


logo