మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 01, 2021 , 07:33:53

కొత్త సంవత్సరం వేళ ఆ ఇంట్లో విషాదం

కొత్త సంవత్సరం వేళ ఆ ఇంట్లో విషాదం

వరంగల్‌: అంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిన వేళ ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. దోస్తు పుట్టినరోజు అని ఇంట్లోనుంచి వెళ్లిన యువకులు అనంతలోకాలకు చేరుకున్నారు. నూతన ఏడాది ముంగిట ఈ దుర్ఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట నీలగిరిస్వామితాండ వద్ద ఓ బైకు చెట్టును ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారి బంధువులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఐత శ్రీకాంత్‌ (20), శ్రీశాంత్‌ (19) మృతిచెందగా, బాలుడు రేవంత్‌ గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వర్ధన్నపేటలో స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.