శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 19:12:13

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల దుర్మరణం

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల దుర్మరణం

మంచిర్యాల : జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారం క్రాస్‌రోడ్డు సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పిన ఘటనలో భీమారానికి చెందిన స్నేహితులు సిరిపురం రాజశేఖర్‌(26), బానోత్‌ గణేశ్‌ నాయక్‌(26) దుర్మరణం చెందారు. రాజశేఖర్‌ కొంతకాలంగా మంచిర్యాలలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తుండగా, లాక్‌డౌన్‌ నుంచి పనిమానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. 

గణేశ్‌నాయక్‌ లారీ, కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఇటీవల ఓ కారు కొనుగోలు చేసి అద్దెకు తిప్పుతున్నాడు. గణేశ్‌ నాయక్‌కు -2018లో అదే గ్రామానికి చెందిన సూజతతో వివాహం జరిగింది. శనివారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో సుజాత పాపకు జన్మనిచ్చింది. రాత్రి వరకు భార్య, పాపను చూసుకున్న గణేశ్‌నాయక్‌ గ్రామానికి తిరిగి వెళ్లే సమయంలో.. మంచిర్యాలలో ఉంటున్న మిత్రుడు రాజశేఖర్‌కు ఫోన్‌చేసి అర్ధరాత్రి తర్వాత భీమారానికి బయలు దేరారు.

ఈ క్రమంలో ఇందారం క్రాస్‌రోడ్డు సమీపంలో బైక్‌ అదుపుతప్పి పడిపోగా గణేశ్‌ తలకు, కడుపులో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్‌ ను మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. 


logo