బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 20:50:32

బైకులు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు

బైకులు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు

గోపాల్‌పేట : బైకులు ఢీకొని ఇద్దరు  యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రం శివారులో ఈ దుర్ఘటన జరిగింది. గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన జుట్టు శివ(30), జుట్టు రాజేందర్‌ వ్యక్తిగత పనులపై పొల్కేపహాడ్‌ గ్రామానికి బైక్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో బుద్ధారం నుంచి మండల కేంద్రానికి వస్తున్న కావలి ఆనంద్‌(18) బైక్‌ను ధన్‌సింగ్‌ తండా వద్ద నేరుగా ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా జుట్టు శివ, కావలి ఆనంద్‌లు మృతి చెందారు. రాజేందర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని వనపర్తి సీఐ సూర్యనాయక్‌ పరిశీలించారు. గోపాల్‌పేట వీఆర్వో సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo