ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 20:22:24

రెండు బైకులు ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

రెండు బైకులు ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

ఖమ్మం : జిల్లాలోని కల్లూరు మండలం కొర్లగూడెం క్రాస్‌రోడ్డు వ‌ద్ద విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఢీకొన్న దుర్ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతులను ఏపీలోని కృష్ణా జిల్లా గంప‌ల‌గూడెం మండ‌లం గోస‌వీడు గ్రామానికి చెందిన గ‌ద్ద‌ల అంబేద్క‌ర్(18)‌, కొర్ల‌గూడెంకు చెందిన‌ చాట్ల వెంక‌టేశ్వ‌ర్లు(20)గా గుర్తించారు. క్ష‌త‌గాత్రుల‌ను కొర్ల‌గూడెంకి చెందిన మోదుగు మ‌హేశ్‌, అరిగెల శివ‌కుమార్‌, కిన్నెర వంశీలుగా గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం ఖ‌మ్మంకు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 


logo