శనివారం 08 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 17:40:36

తాగునీటికోసం వెళ్లి ఇద్దరు మహిళా కూలీలు మృతి

తాగునీటికోసం వెళ్లి ఇద్దరు మహిళా కూలీలు మృతి

ఖమ్మం :  ఖమ్మం జిల్లా కొనిజర్లలో విషాదం చోటు చేసుకుంది. తాగునీటికోసం బావి వద్దకు వెళ్లిన మహిళా కూలీల్లో ఐదుగురు బావిలో పడగా ఇద్దరు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని సహచర మహిళ చీర సాయంతో బయటకు లాగి ప్రాణాలు కాపాడింది. మండల కేంద్రానికి చెందిన 9 మంది మహిళా కూలీలు ఆదివారం ఉదయం కొనిజర్ల శివారులో నాటు వేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాగునీటి కోసం అందరూ వ్యవసాయబావి వద్దకు వెళ్లారు. మొదటి నలుగురు నీళ్లు తాగి ఒడ్డుకు రాగా.. మిగతా ఐదుగురు బావిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఒడ్డు కూలడంతో బావిలోపడ్డారు. చింతల ఎల్లమ్మ అనే మహిళ చాకచక్యంగా వ్యవహరించి తన చీరసాయంతో చింతల మమత, తద్దె నాగమణి, తద్దె మౌనికను బయటకు లాగింది. అప్పటికే నీట మునిగిన తుప్పతి పెద్దరమా (38), బండారు మల్లిక(30) అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.logo