గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 08, 2020 , 11:01:44

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా.. తోబుట్టువులు అరెస్టు

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా.. తోబుట్టువులు అరెస్టు

లుధియానా : డ‌్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న తోబుట్టువులిద్ద‌రిని పంజాబ్ స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్ద‌రు మ‌హిళ‌ల నుంచి 1.2 కిలోల హెరాయిన్ ను పోలీసులు సీజ్ చేశారు. డ్ర‌గ్స్ ను విక్ర‌యిస్తుండ‌గా అక్కాచెల్లెళ్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్ర‌గ్స్ తో పాటు వెయింగ్ మిష‌న్ తో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాలిద్ద‌రిని కిర‌ణ్ బాలా అలియాస్ మ‌న్నా(37), సుమ‌న్ బాలా(45)గా పోలీసులు గుర్తించారు.  ఢిల్లీ, అమృత్ స‌ర్ నుంచి హెరాయిన్ ను తీసుకొచ్చి లుధియానాలో విక్ర‌యిస్తున్న‌ట్లు మ‌హిళ‌లిద్ద‌రూ తెలిపారు. గ‌త ఆరేడు సంవ‌త్స‌రాల నుంచి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ఈ తోబుట్టువులు.. 12 కేసుల్లో విచార‌ణ ఎదుర్కొంటున్నారు.


logo