శనివారం 23 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 08:31:07

ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా జన్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన రాజు అనే వ్యక్తి శంకర్‌పల్లి నుంచి జన్వాడకు ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో జన్వాడ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో రాజు (20) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఉపాధి కోసం యువకులు కర్ణాటక నుంచి జన్వాడకు వచ్చారు. పొట్టకూటి కోసం వచ్చి రోడ్డు ప్రమాదం రూపంలో యువకుడు మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది.  


logo