గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 14:05:16

శ్రీ‌శైలం ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి

శ్రీ‌శైలం ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి

నాగ‌ర్‌క‌ర్నూలు : శ్రీ‌శైలం ఈగ‌ల‌పెంట వ‌ద్ద గ‌డిచిన రాత్రి సంభ‌వించిన రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ఏడుగురిలో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెందారు. మృతుల‌ను హైద‌రాబాద్‌లోని మంగ‌ళ్‌హ‌ట్‌కు చెందిన‌ నీతూ బాయి‌(45), రాజ్‌కుమారీ బాయి‌(65)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శ్రీ‌శైలం ఆల‌య ద‌ర్శ‌నం అనంత‌రం మూడు కుటుంబాలు మంగ‌ళ‌వారం రాత్రి 9 గంట‌ల‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. కాగా వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి కొండ‌ను ఢీకొట్టింది. స్థానికులు, పోలీసులు వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కారులోంచి ఏడుగురు వ్య‌క్తుల‌ను బ‌య‌ట‌కులాగారు. గాయ‌ప‌డ్డ వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నీతూబాయి అప్ప‌టికే మృతిచెందగా రాజ్‌కుమారీ బాయి చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్పత్రికి మార్చురీకి త‌ర‌లించారు. 


logo