శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 10:30:42

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

నిర్మల్‌: జిల్లాలోని కడెం మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మండలంలోని మాసాయిపేట గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొట్టారు.  ఈ సంఘటనలో అదే గ్రామానికి చెందిన పంజల తరుణ్‌(17), దుర్గం గంగాధర్‌(19) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo