మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 19, 2020 , 17:19:55

ఘ‌రానా దొంగ‌లు.. 50 ఇళ్ల‌ల్లో చోరీ

ఘ‌రానా దొంగ‌లు.. 50 ఇళ్ల‌ల్లో చోరీ

చెన్నై : త‌మిళ‌నాడులోని మ‌డిప‌క్కం క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఇద్ద‌రు ఘ‌రానా దొంగ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక‌ట్రెండు ఇండ్లు కాదు.. ఏకంగా 50 ఇండ్ల‌లో వ‌రుస‌గా దొంగ‌త‌నాలు చేసి పోలీసుల‌కు దొరికిపోయారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని రాధాన‌గ‌ర్ మెయిన్‌రోడ్డుతో పాటు స‌మీప ప్రాంతాల్లోని నివాసాల్లో చోరీలు జ‌రుగుతున్న‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం సీత‌ల‌ప‌క్కం చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు చేశారు.

ఇద్ద‌రు అనుమానిత వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా దొంగ‌త‌నాల చిట్టా బ‌య‌ట‌ప‌డింది. మొత్తం 50 నివాసాల్లో చోరీ చేసిన‌ట్లు నిందితులు అంగీక‌రించారు. నిందితుల నుంచి 40 బంగారు నాణెలు, 500 గ్రాముల వెండి, విలువైన ఐదు చేతి గ‌డియారాల‌తో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్ద‌రిని క‌మ‌ల‌క‌న్న‌న్(51), కుమార్‌(44)గా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రిపై 50కి పైగా క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.  


logo