శనివారం 16 జనవరి 2021
Crime - Nov 27, 2020 , 15:27:25

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తనికెళ్ల శివారులోని విజయ కాలేజీ సమయంలో ఎదురెదురుగా వచ్చిన మణుగూరు, సత్తుపల్లి డిపోకు చెందిన బస్సులు తనికెళ్ల వద్ద విజయా కాలేజీ సమయంలో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న సుమారు 13 మంది వరకు గాయపడ్డారు. రెండు బస్సులు ఒక్కసారిగా ఢీకొట్టుకోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.