మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 09:45:41

అబిడ్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అబిడ్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌ : అబిడ్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృత్యువాతపడ్డారు. అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కృపా టిఫిన్‌ సెంటర్‌లో పని చేసే మాస్టర్‌ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా అటువైపుగా వేగంగా వచ్చిన ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తిని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo