శనివారం 16 జనవరి 2021
Crime - Nov 24, 2020 , 20:03:14

ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

ఖమ్మం : నగరంలో పలు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఖానాపురం హావేలి సీఐ వెంకన్నబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అడిషనల్ డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో మంగళవారం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ సమీపంలో వాహనాలు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి విచారించడంతో వాహనాలు ఎత్తుకు వెళ్తున్నట్లు తేలింది. జల్సాలకు అలవాటుపడి నగరంలోని ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, అర్బన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో తొమ్మిది ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించారని చెప్పారు. నిందితులు ఖానాపురం హావేలి ప్రాంతానికి చెందిన ఏవూరి చంద్రశేఖర్, కూసుమంచి మండలం గట్టు సింగారానికి చెందిన దాచేపల్లి  హనుమారెడ్డిగా గుర్తించారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.