హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు, వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన రెహ్మాన్ మాలిక్, షాదుల్ మాలిక్ అనే ఇద్దరు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా (ఏఐ 951) విమానంలో టికెట్ బుక్‌చేసుకున్నారు. దీంతో వారు ఇవాళ ఉదయం విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద ఉన్నవి నకిలీ వీసా, పాస్‌పోర్టులు అని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.