శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 13:12:54

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

పాల్వంచ రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని అనుబోస్ కళాశాల వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని శనివారం ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. పాల్వంచలోని శిఖరం బజార్‌కు చెందిన నరేశ్‌(28) వ్యక్తిగత పని నిమిత్తం కిన్నెరసాని నుంచి తన ద్విచక్ర వాహనంపై పాల్వంచకు వస్తున్నాడు. పాల్వంచ నుంచి కరకావాగు వైపు మరో యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. రెండు బైకులు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీ కొనగా నరేశ్‌ ఎగిరి రోడ్డు మీద పడడంతో తల బలంగా రోడ్డుకు గుద్దుకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించగా, నరేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo