గురువారం 21 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 13:17:52

గోదావరి నదిలో ఇద్దరు గల్లంతు

గోదావరి నదిలో ఇద్దరు గల్లంతు

మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి ఎర్రాయిపేట గ్రామం సమీపంలో గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. గోదావరి నదిలో స్నానం చేసేందుకు సోమవారం మొత్తం ఏడుగురు వ్యక్తులు రాగా ఇద్దరు వ్యక్తులు నాటు పడవ బోల్తా పడటంతో గల్లంతు అయ్యారు. నది నుంచి ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతు అయిన వారిలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యం కాగా, మరొక యువకుడు బండి ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు. చెన్నూరు రూరల్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో గోదావరి నదిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo