గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 20, 2020 , 17:31:58

మాన‌సిక విక‌లాంగురాలిపై దాడి.. వీడియో

మాన‌సిక విక‌లాంగురాలిపై దాడి.. వీడియో

ల‌క్నో : ఓ మాన‌సిక విక‌లాంగురాలిపై ఇద్ద‌రు యువ‌కులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఆమె జుట్టును లాగుతూ.. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కాళ్ల‌తో తన్ని తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌ద‌శ్ లోని ఫ‌రూఖాబాద్ జిల్లాలో గురువారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. 

ఫ‌తేగ‌ర్హ్ లోని తిర్వా కాల‌నీలోనికి ఓ మాన‌సిక విక‌లాంగురాలు వెళ్లింది. ఆక‌లితో ఉన్న ఆమె.. ఆహారం కోసం వెతుకుతున్న‌ట్లు తెలిసింది. అక్క‌డ ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఆ మ‌హిళ ఇద్ద‌రు యువ‌కుల‌పై రాళ్లు విసిరింది. దీంతో వారిద్ద‌రూ ఆమెపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. జుట్ట‌ను లాగుతూ.. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. క‌నిక‌రం లేకుండా కాళ్ల‌తో త‌న్ని తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఈ ఘ‌ట‌నను అక్క‌డున్న కొంద‌రు త‌మ మొబైల్స్ లో చిత్రీక‌రించి.. వైర‌ల్ చేశారు. 

తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆ విక‌లాంగురాలి వాంగ్మూలాన్ని సేక‌రించేందుకు పోలీసులు ఆస్ప‌త్రికి వెళ్లే లోగా ఆమె అక్క‌డ్నుంచి అదృశ్య‌మైంది. బాధితురాలి ఆచూకీ క‌నుగొనే ప‌నిలో పోలీసులు ఉన్నారు. 

నిందితుల‌ను బాబా యాద‌వ్‌, విపిన్ రాజ్ పుత్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రూ కుత్రా మండేయ గ్రామ నివాసితులు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేశారు. 


logo