శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 01, 2020 , 11:13:27

అక్కాచెల్లెళ్ల‌పై గ్యాంగ్‌రేప్‌.. చంపేస్తామ‌ని బెదిరింపు

అక్కాచెల్లెళ్ల‌పై గ్యాంగ్‌రేప్‌.. చంపేస్తామ‌ని బెదిరింపు

రాయ్‌పూర్ : ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ల‌పై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచార వీడియోల‌ను ఆస‌రాగా చేసుకుని త‌మ‌ను బెదిరిస్తున్న వారిపై బాధిత బాలిక‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘోరం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌లోద‌బ‌జార్ జిల్లాలో వెలుగు చూసింది. 

బ‌లోద‌బ‌జార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు మైన‌ర్లు. ఈ ఏడాది మే 31వ తేదీన‌ వీరిద్ద‌రూ ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఓ 8 మంది యువ‌కులు వారిపై విరుచుకుప‌డ్డారు. మైన‌ర్ల‌ను అత్యంత దారుణంగా హింసిస్తూ అత్యాచారం చేశారు. 8 మందిలో ముగ్గురు మైన‌ర్లు ఉన్నారు. 

ఈ స‌మ‌యంలో బాలిక‌ల‌కు తెలియ‌కుండా అత్యాచార ఘ‌ట‌న‌ను త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించారు దుండ‌గులు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే.. వీడియోల‌ను బ‌య‌ట‌పెడుతామ‌ని మైన‌ర్ల‌ను బెదిరించారు. దీంతో ప‌రువు పోతుంద‌ని భావించి.. ఆ బాలిక‌లిద్ద‌రూ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. త‌మ‌కు జ‌రిగిన ఘోర అవ‌మానంతో మ‌న‌సులోనే కుమిలిపోయారు.

జులై 29న ఓ గుర్తు తెలియ‌ని నంబ‌ర్ నుంచి అక్కాచెల్లెళ్ల‌కు ఫోన్ కాల్ వ‌చ్చింది. త‌న వ‌ద్ద స‌న్నిహితంగా ఉండాల‌ని, లేదంటే మీ అత్యాచార వీడియో వైర‌ల్ చేస్తాన‌ని బెదిరించాడు. అలా బెదిరింపు కాల్స్ వ‌స్తుండ‌డంతో.. చేసేదేమీ లేక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు అక్కాచెల్లెళ్లు. 

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక‌రు ఆ అమ్మాయిల‌కు ద‌గ్గ‌రి బంధువు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.


logo