గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 15:35:21

కొడుకు చేతిలో తండ్రి, భర్త చేతిలో భార్య హతం

కొడుకు చేతిలో తండ్రి, భర్త చేతిలో భార్య హతం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేటలో తనయుడే తండ్రిని కడతేర్చాడు. తండ్రి ఎల్లయ్యను కొడుకు ప్రసాద్‌ బండరాళ్లతో కొట్టి చంపాడు. తనను కొట్టినందుకే రాళ్లతో దాడి చేసినట్లుగా ప్రసాద్‌ పేర్కొన్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న మరొక ఘటనలో కట్టుకున్నుడే కాలయముడయ్యాడు. భార్యను కత్తితో మెడకోసి చంపాడు ఓ భర్త. బూర్గంపహాడ్‌ మండలం సారపాక గాంధీనగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.


logo