మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 16:06:05

బాలిక‌పై సామూహిక అత్యాచారం

బాలిక‌పై సామూహిక అత్యాచారం

న్యూఢిల్లీ : ఇద్ద‌రు యువ‌కులు క‌లిసి ఓ 13 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరం దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఢిల్లీలోని జేజే కాల‌నీకి చెందిన ఓ బాలిక‌(13) గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో బాత్రూం కోసం త‌న ఇంటికి స‌మీపంలోని కామ‌న్ బాత్రూమ్‌కు వెళ్లింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన పొరుగింటి కుర్రాడు.. ఆమెను ఫాలో అవుతూ.. త‌న స్నేహితుడి సాయంతో స‌మీపంలో ఉన్న జంగిల్‌లోకి లాక్కెళ్లాడు. అనంత‌రం బాలిక‌ను బెదిరించి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాచారం చేశారు. అక్క‌డ్నుంచి దుండ‌గులిద్ద‌రూ పారిపోయారు.

బాత్రూమ్‌కు వెళ్లిన బాలిక 20 నిమిషాలు అయిన ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో.. త‌ల్లిదండ్రులు ఆ ప‌రిస‌రాల్లో వెతికారు. స‌మీప జంగిల్‌లో తీవ్ర గాయాల‌తో బాలిక‌ను త‌ల్లిదండ్రులు గుర్తించారు. జ‌రిగిన ఘోరాన్ని త‌ల్లిదండ్రుల‌కు బాలిక చెప్పింది. దీంతో బాధితురాలి పేరెంట్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోక్సో చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


logo