బుధవారం 03 జూన్ 2020
Crime - Mar 03, 2020 , 07:43:33

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఇద్దరు మృతి

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఇద్దరు మృతి

మెదక్‌ :  జిల్లాలోని మనోహరాబాద్‌ మండలం కళ్లకల్‌ మహాలక్ష్మి స్టీల్‌ప్లాంట్‌లో గడిచిన రాత్రి ప్రమాదం సంభవించింది. బాయిలర్‌ క్రేన్‌ తెగిపోయిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సుమన్ (25), కార్మికుడు మహేశ్ ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు స్టీల్‌ప్లాంట్‌కు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  సుమన్ స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం. మహేశ్ స్వస్థలం మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా లోలస్ అజయ్ గఢ్ గ్రామం. 


logo