ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 19:58:34

పెంబర్తిలో కారు ఢీకొని ఇద్దరు మృతి

పెంబర్తిలో కారు ఢీకొని ఇద్దరు మృతి

జనగామ : జిల్లాలోని పెంబర్తిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరోక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అధిక వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ఆటో, బైక్‌, సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నర్సయ్య, ఆనంద్‌ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. 

కారు-స్కార్పియో ఢీ.. ఇద్దరు మృతి

ఏపీలోని గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కనమర్లపూడి వద్ద ఈ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-స్కార్పియో ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఏలూరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం భారిన పడ్డారు.


logo