శనివారం 16 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 21:36:16

భద్రాచలం-సారపాక బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..

భద్రాచలం-సారపాక బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని భ‌ద్రాచ‌లం-సార‌పాక బ్రిడ్జిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతిచెంద‌గా మ‌రొక వ్య‌క్తి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబల్లి గ్రామానికి చెందిన నరేష్(24), ప్రవీణ్(24)లు బైక్‌పై అతివేగంగా వస్తూ భద్రాచలం-సారపాక బ్రిడ్జిపై ముందు వెళుతున్న కర్ర ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ సంఘటనలో ఒకరు ఆక్కడే మృతిచెందగా మరొకరిని స్థానికులు 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్ప‌టికే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ బమ్మెర బాలకృష్ణ ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ప్ర‌మాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.