బుధవారం 20 జనవరి 2021
Crime - Nov 09, 2020 , 09:42:38

బైక్ అదుపుత‌ప్పి ఇద్ద‌రు యువ‌కులు మృతి

బైక్ అదుపుత‌ప్పి ఇద్ద‌రు యువ‌కులు మృతి

సిద్దిపేట : జిల్లాలోని మ‌ద్దూరు మండ‌లం న‌ర‌సాయ‌ప‌ల్లిలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. నరసాయపల్లి వెంకట్‌రెడ్డి చెరువు వద్ద ఫైబర్ నెట్ కాలువలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి బోల్తాప‌డింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతుల‌ను చేర్యాల మండలం పెద్దమ్మగడ్డకు చెందిన కనికరం మహేష్, జీవన్ లుగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. 


logo