Crime
- Jan 25, 2021 , 09:42:18
VIDEOS
నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

నల్లగొండ: పట్టణంలో ఇద్దరు వ్యక్తుల హత్యలు కలకలం రేపాయి. రాంనగర్‌లోని ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు గురయ్యారు. దుండగులు వారిని బండరాళ్లతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు బీహార్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
తాజావార్తలు
MOST READ
TRENDING