శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 18:02:31

ప్రాణాలమీదికొచ్చిన ‘కుక్క’ పంచాయితి!

ప్రాణాలమీదికొచ్చిన ‘కుక్క’ పంచాయితి!

బిజ్నోర్‌ : ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ర్టం బిజ్నోర్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. కుక్కను కొనుగోలు చేయడంపై రెండు గ్రూపులు ఒకరితో ఒకరు గొడవపడి కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఒక బాటసారితో సహా మరొకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు బుధవారం తెలిపారు.

వివరాలు.. బిజ్నోర్‌ జిల్లాకు చెందిన రెండు గ్రూపులు మంగళవారం రాత్రి కుక్కలను కొనుగోలు చేయడానికి వచ్చాయి. అయితే రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు ఒకే కుక్కను మెచ్చి దాన్నే కొనుగోలు చేయాలని నిర్ణయించకున్నారు. ఈకుక్క మాదంటే మాదని ఇరు గ్రూపులకు చెందిన వ్యాక్తులు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం కాస్తా తీవ్రం కావడంతో ఇద్దరు తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో రోడ్డుపై వెళ్తున్న ప్రశాంత్ అనే యువకుడికి బుల్లెట్‌ తగులడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో పాటు ఘర్షణకు దిగిన వారిలో సురేంద్ర అనే వ్యక్తి మృతిచెందిగా మరొకరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మీరట్‌లోని దవాఖానకు తరలించారు. 

ధంపూర్ పోలీస్ సర్కిల్‌లో ఈ సంఘటన జరగ్గా నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయని బిజ్నోర్‌ ఎస్పీ సంజీవ్‌ త్యాగి తెలిపారు. ఈ సంఘటనలో ఇరు వర్గాలు అక్రమ తుపాకులను ఉపయోగించాయని, రెండు గ్రూపులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo