ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Sep 17, 2020 , 11:50:04

వాగులో పడి ఇద్దరు మృతి..సత్వార్ లో విషాదం

వాగులో పడి ఇద్దరు మృతి..సత్వార్ లో విషాదం

సంగారెడ్డి : రాత్రి కురిసిన వర్షాలకు పొంగి పొర్లిన వాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం గ్రామ పరిధిలో భారీ వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రాజు (40), హద్నూర్ గ్రామానికి చెందిన రాజు (40) వాగులో పడి కొట్టుకుపోయారు. గురువారం ఉదయం గ్రామ శివారు లోని ముళ్ల పొదల మధ్యలో మృత దేహాలను గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృత దేహాలను జహీరాబాద్ దవాఖానకు తరలించారు.logo