మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 18:02:13

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి..మరొకరి పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి..మరొకరి పరిస్థితి విషమం

మహబూబ్ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైకులు ఢీనకొడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై కారు, బైకులు ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఎడ్ల శ్రీనివాస్ గౌడ్(45), శేఖర్(42) మృతి చెందారు. రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముగ్గురు జడ్చర్ల వాసులు. ప్రస్తుతం గాయపడిన రాజును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo